Chorus
ప్రభూ నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును
మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను
Verse
ప్రభువా యెరిగితిని లోకమంత మోసమని
చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో
కృతజ్ఞత కలిగి‖ 2x ‖
నీవైపే చూచెదను
నీయందే నిలిచి యుండి నీయాజ్ఞల పాలింతును
Verse
నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను
నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును
నెమ్మదిని పొంది యిల‖ 2x ‖
కన్నీరు - కార్చనిక
నీవే నా సర్వమని నీయందే బలపడెద
Verse
యేసుని సిలువజూచి విజయమును పొందెదను
సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని
నిన్ను నే నమ్మెదను‖ 2x ‖
నీతోనే సాగెదను
నీ రెక్కలచాటు నేనుండ భయపడను
Verse
మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను
మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు
రక్షకుని చూఛెదను‖ 2x ‖
నన్నాయన చేర్చుకొనున్
తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను
Verse
అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి
దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను
నే సంతసించెదను‖ 2x ‖
ప్రభువుతోడ నుండెదను
నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును