Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Dayacheyu Nitya Deevenalu Berakaalo Choothuru

ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు

Prabhu Dayacheyu Nitya Deevenalu Berakaalo Choothuru

Verse 1
Reference: వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ... ఆ చోటికి బెరాకా లోయయని పేరు 2 దినవృత్తాంతములు Chronicles 20:26
Chorus
ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు
Verse
కీడు, యుద్ధము, తెగులు, కరువైనను
దాడి చేయబూని విజృంభించి నపుడు
నీవు మొరపెట్టిన నీకు దొరుకు - నిజముగా - రక్షణ
Verse
శత్రు శోధనలు పై బడినప్పుడు
శక్తిహీనులమై పోయినప్పుడు
క్రీస్తు దయచేయు నిత్యాదరణ - నిజముగా - చూతురు
Verse
ప్రభు యుద్ధము చీయు నాయకుడు
ప్రభు పక్షమందు చీరుము యీనాడే
నీవు పొందెదవు బెరాకాలో - నిజముగా - జయము
Verse
పలువిధ శ్రమలందు చేరుమా
ప్రీతిమీర మిమ్ము దరిచేర్చును
నీతియుక్తముగా స్తుతించుము - ఖ్యాతితో ప్రభుని
Verse
నిత్యదేవుని మహాకృప నిరతం
శత్రువును జయించును నిశ్చయం
కృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి
Verse
స్వరమండల సితారా వాయించుడి
శత్రువులతో ప్రభు పోరుసల్పెను
బెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి
Verse
పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది
భూరాజులు గడగడ వణికిరి
తన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ - పాడుడి

Related Tags

ThanksgivingVictoryProtectionBlessing