Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Goppa Kaaryamulu Chaesenani Manamuthsahimchedhamu

ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము

Prabhu Goppa Kaaryamulu Chaesenani Manamuthsahimchedhamu

Verse
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా
Verse
ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె
పాత్రులముగా సేవింతుము
Verse
దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము
దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాదెదము
Verse
సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని
సితార స్వరమండలములతో - మన మార్భాటించెదము
Verse
మన భారములన్నియు తొలగించె - ఘనకార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో
Verse
నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం
Verse
ప్రేమా సౌందర్యములు గలవాడు - క్షేమము నిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము
Verse
మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్

Related Tags

PraiseThanksgiving