Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Kristhesu Neeke Maa Sthuthulu Vibhuda Maadu Sthuthule Nee Haaramulu

ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు విభుడా మాదు స్తుతులే నీ హారములు

Prabhu Kristhesu Neeke Maa Sthuthulu Vibhuda Maadu Sthuthule Nee Haaramulu

Verse
పల్లవి: ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు
విభుడా మాదు స్తుతులే - నీ హారములు
Verse
నీ దేవుండైనట్టి నేను - నీకు నిత్యం - తోడై యున్నాను
నీకేమియు తక్కువకా - దన్న ప్రియుడా
Verse
మునుపటికంటె - అధికంబైన - మేలును మీకు - కలుగ జేసెదను
అని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా
Verse
విస్తార వెండి బంగారం - ఎంతో ఉన్నది - పని ప్రారంభించి
మందిరమును కట్టించు - మనిన ప్రభువా
Verse
నా సంఘమును - నే కట్టెదను - నాతో మీరు - జత పనివారనిన
వింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు
Verse
పర్వతముల - నెక్కి మీరు - మ్రానులందెచ్చి - నా మందిరమును
నిర్మించిన సంతోషింతుననిన
Verse
సంధ్యారాగ - చంద్రబింబం - సూర్యకాంతి - కళలన్ మెరిసేటి
సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న
Verse
ఆ దివ్య భాగ్యమా - కెపుడో - వింతైన నీ రాకడ నాశించి
వేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా

Related Tags

PraiseWorshipJesus