Chorus
ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు
దీవెనల వర్షము కుమ్మరించుము
Verse
ఓమా యేసు విను మామనవి - మా మధ్యకు ప్రభు రారమ్ము
నీ ద్వారమున చేరి యున్నాము - నింపుము ప్రభువా మమ్ములను
Verse
దప్పిగొన్న వారికి జలము - యెండిన భూమికి జలధారల్
నీ సంతతిపై ఆత్మను పంపు - నీ దీవెనలతో నింపుము
Verse
తండ్రి కుడిప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము
ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము
Verse
రెండు కెరూబుల మధ్య నుండి - మధుర స్వరము విననిమ్ము
యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము
Verse
తెరువబడిన పరమునుచూడ - దూతలు యెక్కుచు దిగుచుండ
నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు