Verse
ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే
ధన్యుండు‖ ప్రభు ‖
Verse
అపుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ
గాక‖ ప్రభు ‖
Verse
నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును
గాక‖ ప్రభు ‖
Verse
పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక
||ప్రభు||‖ ప్రభు ‖
Verse
ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది
వికసించునుగాక‖ ప్రభు ‖
Verse
ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి
బ్రతికించునుగాక‖ ప్రభు ‖
Verse
అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు
జూచెదవు‖ ప్రభు ‖
Verse
నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి
మోదమొందెదరు‖ ప్రభు ‖
Verse
తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం
దుండుగా కామేన్‖ ప్రభు ‖