Verse
ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా‖ 2x ప్రభు ‖
Verse
నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా‖ 2x ‖
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా‖ 2x నీ కొరకే ‖
Verse
ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ‖ 2x ‖
చక్కని ప్రభు నీ మోము జూడ‖ 2x నీ కొరకే ‖
Verse
మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే‖ 2x ‖
స్తుతికి కారణభూతుడా నీవే‖ 2x నీ కొరకే ‖