Chorus
ప్రభు నిను కీర్తించుచున్నాము
యేసు నిను కీర్తించుచున్నాము
నిను కీర్తించుచున్నాము
Verse
పాపములోన చచ్చిన నన్ను
ప్రభువా ప్రేమించితివి
Verse
తప్పిన నన్ను వెదకి రక్షింప
తనయుడవై వచ్చితివి
Verse
నా యాశ్రయము కూలిపోగ
నను రక్షింప నేగితివి
Verse
సిలువలో చిందిన రక్తముతో నా
కలుషములు కడిగితివి
Verse
మరణించి మరణపు ముల్లును
విరచి మరల లేచితివి
Verse
తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి
తనయా తోడ్పడితివి
Verse
నాకై మరల వచ్చుచున్నావు
సంకీర్తించెద నిన్ను