Chorus
ప్రభు ప్రజలారా - రయమున రండి
యాకోబు వంశమా - స్వకీయ జనమా
యెహోవా వెలుగులో - నడుతము రండి
Verse
అంత్య దినములందు - పొంతన లేనట్టి
మందిర పర్వత - శోభను గాంచగ
ఉన్నత పర్వత - శిఖరమందుండి
మహిమతో యిమ్మహి - వర్థిల్లును
Verse
యెహోవా మందిర - మందున బోధించు
హితబోధను విని - తన త్రోవ నడువగ
యాకోబు దేవుని - నివాసమునకు
పంక్తులై జనులు - పరుగిడి వత్తురు
Verse
యెహోవా వంతు ఆయన జనమే
యాకోబే తన - స్వాస్థ్యం బాయెన్
భీకర యెడారిలో - కనుగొనె వానిని
ఎంచెను కాచెను - కనుపాపగను
Verse
కమనీయంబగు - కలకని యాకోబు
గాంచెను నిచ్చెనన్ - భువినుండి దివికి
నిలువగ యెహోవా - దానికి పైగా
బేతేలే యిది - వేరేది కాదనెన్
Verse
దేవుని మందిర - ప్రత్యక్షతలు
సజీవ్ సంఘ - మందున నింపెన్
సత్యమునకు నిది - ఆధారమును
స్తంభము గానై - స్థిరముగ నుండెను
Verse
నూతనమైనట్టి - యెరూషాలే మది
నిత్య దేవుని - నివాసమాయె
భక్తులు చేరి - ప్రస్తుతింపగ
స్తుతులకు మధ్యను - ప్రభవించును ప్రభు
Verse
కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును
నరహంతకులును - విగ్రహారాధికులు
అబద్ధమును ప్రేమించి - జరిగించు
ప్రతివాడునట - వెలుపట నుందురు
Verse
సర్ప సంతానము నుండి - వేరైనవారై
క్రీస్తుని రక్తమున్ - కోరి వేడినచో
స్వకీయ ధనమౌ - యాకోబు వంశమై
కీర్తింతురు ప్రభున్ - హల్లెలూయ