Chorus
ప్రభు ప్రేమ తొలికేక హృదయంలో ప్రతిధ్వనియించే
పాపక్షమా యేసునిలో శరణు నొసంగుచు కనిపించే
Verse
పాపవికారము పొడసూప జీవితవిలువలు మరుగాయె
ఫలితముగా లోకములో బ్రతుకుటయే నాగతియాయె
పలువురిలో కనబడలేకా దాహముతో నేనొంటరిగా
బావికని పయనింప నాదుని దర్శనమెదురాయే
పావనుడు దాహముతో జలమును ఇమ్మని ననుగోరె‖ ప్ర ‖
Verse
జాతిని చూడని నేత్రముతో పాపము శోకని హృదయముతో
జాలిని చాటించుచునే తాకెను నామది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియే దాచుకొనిన నాపాపమును
జడియచునే తెలిపితిని ప్రభు వెరిగిన నా నిజస్థితిని
జయమొందె నాతనువూ సరిగ నుడితవని ప్రభు తెలుపా
Verse
దేహమునే నాసర్వముగా భావించుచు మది పూజింపా
దినదినము జీవితమూ చావుగ మారిన కాలములో
దేవునిగా నా బంధువుగా మరణప్రవాహము చేధించి
దరిజేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే
దయ్యాల కుహరమును స్తుతి మందిరముగ రూపించే‖ ప్ర ‖
Verse
పాపము దాగును నాబావి లోతును చూచినదెవరు
పోరాటవాటికయౌ నా బ్రతుకును ఎరిగినవారెవరు
పాపికిని పాపమునకునూ భేదము చూపిన వారెవరూ
పాపిని కాపాడుటకు సిలువను మోసిన వారెవరూ
ప్రకటించె దైవకృప తెరచెను జీవన జలనిధులు‖ ప్ర ‖
Verse
ఘటముతో వెడలితి నొంటరిగా పితరుల త్రానజనములకై
కనబడెను బావికడ రక్షణయూటల ప్రభుయేసు
కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో
ఘనమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు తెలుసా
గ్రామప్రజా కనుగొనిరి విశ్వవిమోచకుడగు యేసున్‖ ప్ర ‖