Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Punaraagamareethi Vinu Mo Prabha

ప్రభు పునరాగమరీతి విను మో ప్రభ

Prabhu Punaraagamareethi Vinu Mo Prabha

Chorus
ప్రభు పునరాగమరీతి విను మో ప్రభాతగీతి చయ్యన రానయె జ్యోతి
సమయంబులేదు ధాత్రి‖ ప్రభు ‖
Verse
పవలు పదియురెండు ఘంటలు పాపతమోహేళి భువనంబులు తెల్వి
దేల్చి ప్ర బోధ సుప్రభాళి కువలయు త్రాణముకై కడపట కుధర ముపై
వ్రాలి చన దవిలిన శోకమున ద్విజాతివి తతి గుండెవిరాళి‖ ప్రభు ‖
Verse
గతియించెను సంధ్యచీకటి కారుకొనెంధాటి మతి స్వాస్థ్యము నెడగా
క్రీస్తు స మాజప్రజాకోటి క్షితితలాన రాజుప్రభవెలి గెన్నొ కింతపాటి
అట మృతిభయంకరంబై వడినడి రేయిపోయెదాటి‖ ప్రభు ‖
Verse
తొలి జాముస్తవముజేసె విహంగమ సంఘములలవోక కడు దీమసమున
మింట చటుక్కున దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము దెచ్చెవేగ
బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ‖ ప్రభు ‖

Related Tags

WorshipSecond Coming