Verse
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం‖ 2x ‖
హాల్లెలూయా హాల్లెలూయా
హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా‖ 2x ప్రభు ‖
Verse
ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి‖ 2x ‖
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును‖ 2x ప్రభు ‖
Verse
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి‖ 2x ‖
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి‖ 2x ప్రభు ‖