Chorus
ప్రభు సేవ కిదియే సమయంబు ప్రజల విమల ఫలముల నొంద
నిదియే సమయంబు‖ ప్రభు ‖
Verse
మరణంబు బడయక మున్నే ఘోర తరమైన పాపాత్ము లరసి గుణ
పడఁగ నరక వేదనఁ బాపు కొరకు దేవుఁ డరిమురి తరి యెంతో
కరుణతో నొసఁగెఁ‖ ప్రభు ‖
Verse
కరుణ గల్గెడి దివసములలో నీవు పరమ భాగ్యంబులు బడయుంగ
వచ్చు మరణం బెరిఁగిన జీవాత్మ యద్ది మఱచెదవి ది యెంతో
అరుదై యున్నది‖ ప్రభు ‖
Verse
పశ్చాత్తాపం బనెడి తలుపు మూయఁ బడుమ దేవుని కరుణా భాగ్య
మను తలుపు నిశ్చయమంబుగ వేయఁబడు నెంతో యాశ్చర్యకరమౌ
నవన మగుపడదు‖ ప్రభు ‖
Verse
సారస్యమైన కార్యములం జేయ సమయ మనెడి తలుపు సరగ
మూయబడున్ వారక మృతి బొందునపుడే గాక సార కార్యము లన్ని
జక్కఁగాఁ జేయు‖ ప్రభు ‖
Verse
గత దినంబులకై స్తుతింతున్ మిగుల కఠినంబులైనట్టి గండముల
నుండి ప్రతి దినంబును దప్పించుచు నెంతో మితిలేని కృపచేత
బ్రతికించు మనలఁ‖ ప్రభు ‖
Verse
నీతియుతులగు భక్తులారా మన పాతకములకుఁ జచ్చి పరమేశ్వరుని
ప్రీతి మ్రొక్కులు చెల్లించుదము నూత్న వత్సరము ప్రభు స్తుతికై
బ్రతుకుదుము‖ ప్రభు ‖