Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Shree Yaesu Prabhu Shree Yaesu Jayashaalee

ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీ

Prabhu Shree Yaesu Prabhu Shree Yaesu Jayashaalee

Verse
ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీ
సర్వ సృష్టి కర్తయు తానే సకల జీవుల పాలకుడు యేసే
Verse
సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపి
రండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు
Verse
జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడు
పాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను
Verse
పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడెసుని జేరి
పాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి

Related Tags

GospelSalvationJesus