Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Yaesu Pilupunu O Priyudaa Pedachevini Pettedhavaa

ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా

Prabhu Yaesu Pilupunu O Priyudaa Pedachevini Pettedhavaa

Verse
ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా - పెడచెవిని పెట్టెదవా
తీర్మానము చేయకనే వెళ్ళెదవా - ప్రభుసన్నిధిలో నుండి
Verse
లేత వయస్సు నడిప్రాయమును - గతొంచి పోవునవి
మన్నయినది వెనుకటివలెనే - మరల భూమికి చేరున్
ఆత్మదాని దయచేసిన - దేవుని యొద్దకు పోవున్
ఆ లోకములో నీ ముందుగతి ఏమౌనో ఎరిగితివా
Verse
ఏపాటిది నీ జీవితమంత - ఏపాటిది నీ తనువు
గడ్డిపువ్వుతో సమమిదియేరా - అదియే నీ జీవితము
అంతలోన మాయము అగు - వింత బుడగయే కాదా
అంతలోన అంతర్థానంబగు ఆవిరియేకాదా
Verse
వ్యర్థము వ్యర్థము సర్వము యిలలో - ఇదియే యేసుని మాట
నిలువని నీడ యీ లోకమురా - కలుషాత్మ కనుగొనరా
లోకమంత సంపాదించి - లోభీ నీ ప్రాణమును
నష్టపరచుకొనిన నీకు నరుడా లాభముకలదా
Verse
తామసించ తగదిక నీకు - తక్షణమే తిరుగుమురా
విరిగి నలిగి హృదయము కరిగి - వినయముతో ప్రభు జేరి
యేసు ప్రభుని సిలువచెంత - యేసుని రక్తముకోరి
ప్రలాపించి నీదు సకల పాపము నొప్పుకొనుమా
Verse
నీ రక్షణకై నిలిచెను యేసు - తన రక్తధారలతో
కడుగును నిన్ను క్షమించును - వడిగా యీ క్షణమందే
నీ నామమును పరలోకములో - నేడే వ్రాసి యుంచున్
రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా

Related Tags

InvitationGospelSalvation