Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Yaesuni Naenu Naenu Vembadimthunu Thana Adugu Jaadalaloa Nadichedhanu

ప్రభు యేసుని నేను నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడిచెదను

Prabhu Yaesuni Naenu Naenu Vembadimthunu Thana Adugu Jaadalaloa Nadichedhanu

Verse
ప్రభు యేసుని నేను నేను వెంబడింతును‖ 2x ‖
తన అడుగు జాడలలో నడిచెదను‖ 2x ‖
Verse
లోకమున్ విడిచి సిలువను మోసి
దీక్షతో ప్రభుని వెంబడింతును
Verse
కాపరి యేసు స్వరమును వినుచు
చూపెడి స్థలముల కేగెదను
Verse
చీకటి జగతిని తప్పించుకొని
వాక్యపు వెలుగులో వెంబడింతును
Verse
పాప విశాల మార్గమున్ విడచి
పరుగిడెదను జీవ మార్గమున
Verse
అంతమువరకు స్థిరముగ నిలిచి
అమూల్యమకుటము పొందెదను

Related Tags

DedicationDiscipleshipFollowing Jesus