Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Yesu Naa Rakshakaa

ప్రభు యేసు నా రక్షకా

Prabhu Yesu Naa Rakshakaa

Lyricist: Songs Of Zion
Verse
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ‖ 2x ‖
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే‖ 2x ప్రభు యేసు ‖
Verse
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము‖ 2x ‖
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము‖ 2x ప్రభు యేసు ‖
Verse
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని‖ 2x ‖
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము‖ 2x ప్రభు యేసు ‖
Verse
ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని‖ 2x ‖
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము‖ 2x ప్రభు యేసు ‖
Verse
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున‖ 2x ‖
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు‖ 2x ప్రభు యేసు ‖
Verse
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ‖ 2x ‖
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు‖ 2x ప్రభు యేసు ‖
Verse
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో‖ 2x ‖
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై‖ 2x ప్రభు యేసు ‖
Verse
లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము‖ 2x ‖
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము‖ 2x ప్రభు యేసు ‖

Related Tags

PraiseWorshipJesus