Verse
ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక‖ 2x ‖
Verse
బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను‖ 2x ‖
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..
Verse
పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా‖ 2x ‖
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..
Verse
నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను‖ 2x ‖
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..
Verse
ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా…‖ 2x ‖
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ