Chorus
ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు
ప్రజలందరి కత్యవసరము ఆ ఆ
Verse
దర్శనము లేక ప్రజలు నశింతురు
దీనినక్కరతో గమనించెదము
Verse
యెషయాచూచె సైన్యముల యెహోవాను
ఉజ్జియా మరణించినపుడు ఆ ఆ
యెహోవా పరిశుద్ధుడని ముమ్మారు
దూతల గొప్ప ద్వని వినెనపుడు
Verse
యెహెజ్కేలుకు అధిపతివలె కనబడె
నా భాగ్యమెవరికి లేదా ఆ ఆ
నాళు ముఖములతో నాలుగు జీవులు
కన్నులతో నిండియున్న చక్రములు
Verse
శాశ్వత రాజ్యములు కల్గిన రాజును
అగ్నివంటి సింహాసనమున్ ఆ ఆ
కోట్లకొలది జనులు తీర్పునకై
కాచియుండుట చూచెను దానియేలు
Verse
కొండపై యేసు రూపాంతర మొందిన
సందర్భము మరువగలమా ఆ ఆ
భయ మొందిరచ్చట ముగ్గురు శిష్యుల్
ప్రియసుతుని గూర్చి తండ్రి జెప్పగనె
Verse
పత్మాసు ద్వీపమున యోహానుజూచిన
ప్రభువే సంఘమునకు శిరస్సు ఆ ఆ
మహా ప్రధాన యాజకుడాయనే
మహిమ ప్రభావ రూపుడు యేసే
Verse
సిణాసనము మధ్యలో నున్నవాడే
సింహమగు దైవ గొఱ్ఱెపిల్ల ఆ ఆ
ఆరాధింపబడు దేవుడు నాయనే
అందరి యారాధన లాయనకే
Verse
తెల్లని యశ్వముపై నున్న వీరుడు
నమ్మకమగు సత్యరూపి ఆ ఆ
దేవుని వాక్యము న్యాయాధీపతియగు
జీవుల దేవునికే హల్లెలూయ