Verse
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె‖ 2x ‖
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో‖ 2x ‖
పరలోకముకై – చిర జీవముకై‖ 2x ‖
ప్రార్ధించెను నా హృదయం‖ ప్రభు యేసుని ‖
Verse
దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో‖ 2x ‖
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును‖ 2x ‖
ధన పీడనతో – మృగ వాంఛలతో‖ 2x ‖
దిగాజారితి చావునకు‖ ప్రభు యేసుని ‖
Verse
యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు‖ 2x ‖
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని‖ 2x ‖
ఇల వేడితిని – విలపించుచును‖ 2x ‖
ఈడేరెను నా వినతి‖ ప్రభు యేసుని ‖
Verse
పరదైసున ఈ దినమే – నా ఆనందములోను‖ 2x ‖
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే‖ 2x ‖
పరలోకమే నా – తుది ఊపిరిగా‖ 2x ‖
పయనించితి ప్రభు కడకు‖ ప్రభు యేసుని ‖