Chorus
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో
పరికించిన శుభదినము గమనించిన యాక్షణము
పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం
Verse
దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతో
దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును
ధన పీడనతో మృగ వాంఛలతో దిగజారితి చావునకు
Verse
యేసు నీరాజ్యములో భువి కేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని
ఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి‖ ప్రభు ‖
Verse
పరదైనున ఈ దినమే నా ఆనందముతోను
పాల్గొందువు నీవనుచు వాగ్ధానము చేయగానే‖ 2x ‖
పరలోకమె నా తుది వూపిరిగా పయనించితి ప్రభుకడకు
ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె‖ ప్రభు ‖