Verse
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును
ఘన విజయమిచ్చును
Verse
ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ
మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు ‖
Verse
దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు
లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు ‖
Verse
శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్
క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు ‖
Verse
అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము
అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు ‖
Verse
జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్
దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు ‖