Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuke Sthothramu

ప్రభుకే స్తోత్రము

Prabhuke Sthothramu

Lyricist: Songs Of Zion
Verse
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును
ఘన విజయమిచ్చును‖ 2x ‖
Verse
ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ
మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము‖ 2x ‖
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు యేసు ‖
Verse
దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు
లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము‖ 2x ‖
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు యేసు ‖
Verse
శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్
క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు‖ 2x ‖
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు యేసు ‖
Verse
అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము
అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే‖ 2x ‖
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు యేసు ‖
Verse
జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్
దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు‖ 2x ‖
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం‖ ప్రభు యేసు ‖

Related Tags

PraiseVictoryResurrectionEaster