Chorus
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ వాసనగానుండ
ప్రభువు చిత్తమును పరిగణించుటయె సంఘము నీ బాధ్యతగాదా!‖ ప్రభు ‖
Verse
దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ
ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా?‖ ప్రభు ‖
Verse
యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను
పావనులుగ నిలఁ జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా?‖ ప్రభు ‖
Verse
బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ
వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా!‖ ప్రభు ‖
Verse
దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్
సవ్యంబుగసరి జేయఁగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా?‖ ప్రభు ‖
Verse
పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను
మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా?‖ ప్రభు ‖
Verse
క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ
భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా?‖ ప్రభు ‖