Verse
ప్రభుని గృహము ఆయన మహిమతో
పరిపూర్ణముగా నిండెను‖ 2x ‖
Verse
అపరాధములచే ప్రజలందరును
దేవుని మహిమను కోల్పోయిరి‖ 2x ‖
తన మహిమను మన కిచ్చుటకు‖ 2x ‖
యేసు ప్రభువే బలి యాయెన్‖ 2x ప్రభుని ‖
Verse
కృపా సత్యములు సంపూర్ణముగా
మన మధ్యలో వసించెను‖ 2x ‖
తండ్రి మహిమను తన సుతునిలో‖ 2x ‖
మనమందరము చూచితిమి‖ 2x ప్రభుని ‖
Verse
ప్రభువు యింటిని నిర్మించు చుండె
సజీవమైన రాళ్ళతో‖ 2x ‖
ఆయన మహిమ దానియందుండ‖ 2x ‖
తన సంకల్పమై యున్నది‖ 2x ప్రభుని ‖
Verse
శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు
మానవ హస్తము అందుండదు‖ 2x ‖
క్రయమునిచ్చి స్థలముకొనెను‖ 2x ‖
తాను కోరిన స్థలమదే‖ 2x ప్రభుని ‖
Verse
ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి
తన పునాదిని వేసెను‖ 2x ‖
రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా‖ 2x ‖
ప్రభువే సర్వము చేసెను‖ 2x ప్రభుని ‖
Verse
సింహాసనముపై కూర్చున్న ప్రభువే
అణగ ద్రొక్కెను శత్రువును‖ 2x ‖
సంపూర్ణ జయముతో ఆర్భాటముతో‖ 2x ‖
వెలిగించెను తన యింటిని‖ 2x ప్రభుని ‖
Verse
దేవుని యిల్లు ముగించబడగా
పైనుండి అగ్ని దిగివచ్చున్‖ 2x ‖
దహించబడును సర్వ మలినము‖ 2x ‖
ఇంటిని మహిమతో నింపును‖ 2x ప్రభుని ‖