Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuni Gruhamu Aayana Mahimatho Paripoornamuga Nindenu

ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను

Prabhuni Gruhamu Aayana Mahimatho Paripoornamuga Nindenu

Chorus
ప్రభుని గృహము ఆయన మహిమతో - పరిపూర్ణముగా నిండెను
Verse
అపరాధములచే ప్రజలందరును - దేవుని మహిమను కోల్పోయిరి
తన మహిమను మన కిచ్చుటకు - యేసు ప్రభువే బలి యాయెన్
Verse
కృపా సత్యములు సంపూర్ణముగా - మన మధ్యలో వసించెను
తండ్రి మహిమను తన సుతునిలో - మన మందరము చూచితిమి
Verse
ప్రభువు యింటిని నిర్మించు చుండె - సజీవమైన రాళ్ళతో
ఆయన మహిమ దానియందుండ - తన సంకల్పమై యున్నది
Verse
శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు - మానవ హస్తము అందుండదు
క్రయమునిచ్చి స్థలముకొనెను - తాను కోరిన స్థలమదే
Verse
ప్రత్యేక పరచిన ఆత్మీయ యింటికి తన పునాదిని వేసెను
రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా - ప్రభువే సర్వము చేసెను
Verse
సింహాసనముపై కూర్చున్న ప్రభువే - అణగ ద్రొక్కెను శత్రువును
సంపూర్ణ జయముతో ఆర్భాటముతో - వెలిగించెను తన యింటిని
Verse
దేవుని యిల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగివచ్చున్
దహించ బడును సర్వమలినము - ఇంటిని మహిమతో నింపును

Related Tags

WorshipGloryChurch