Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuni Raakada

ప్రభుని రాకడ

Prabhuni Raakada

Lyricist: Songs Of Zion
Verse
ప్రభుని రాకడ – ఈ దినమే
పరుగులిడి రండి – సుదినమే‖ 2x ‖
పరమునందుండి – మన ప్రభువు
ధరకు నరుగును – పాలనకై‖ 2x ‖
బూరశబ్దముతో – జనులారా‖ ప్రభుని ‖
Verse
సిద్ధులగు వారిన్ – మన యేసు
శుద్ధి జేయునిలన్ – పరమునకై‖ 2x ‖
బుద్ధిహీనులను – శ్రమలచేత
బద్ధులుగ జేయున్ – వేదనతో‖ 2x ‖
బాధ కలిగించున్ – సాతాను‖ ప్రభుని ‖
Verse
స్వరముతో వచ్చున్ – అధికారి
మహిమతో మరలున్ – తన దూత‖ 2x ‖
సూర్యచంద్రునిలన్ – తారలతో
జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక‖ 2x ‖
పగలు రాత్రియగున్ – త్వరపడుము‖ ప్రభుని ‖
Verse
మొదట లేతురు – సజీవులై
ప్రభునియందుండు – ఆ మృతులు‖ 2x ‖
మరల అందరము – ఆ ధ్వనితో
పరము జేరుదుము – ధరనుండి‖ 2x ‖
ధన్యులగుదుము – పరికించు‖ ప్రభుని ‖
Verse
వెయ్యియేండ్లు – పాలించెదరు
ప్రియుని రాజ్యమున – ప్రియులు‖ 2x ‖
సాయం సమయమున – చేరి
నెమలి కోకిలలు – రాజున్‖ 2x ‖
పాడి స్తుతించును – ఆ దినము‖ ప్రభుని ‖
Verse
గొర్రె మేకలును – ఆ చిరుత
సింహజాతులును – ఒక చోట‖ 2x ‖
భేధము లేక – బరుండి
గరిక మేయును – ఆ వేళ‖ 2x ‖
కలసి మెలగును – భయపడక‖ ప్రభుని ‖
Verse
న్యాయ నీతులన్ – మన ప్రభువు
ఖాయముగ దెల్పున్ – ఆనాడు‖ 2x ‖
సాక్షులుగ నిలుతుం – అందరము
స్వామియేసునకు – ధ్వజమెత్తి‖ 2x ‖
చాటి యేసునకు – ఓ ప్రియుడా‖ ప్రభుని ‖

Related Tags

Second ComingRaptureEnd Times