Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuni Raakada Ee Dhiname Parugulidi Randi Sudhiname

ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే

Prabhuni Raakada Ee Dhiname Parugulidi Randi Sudhiname

Chorus
ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే
Pre-Chorus
పరమునందుండి మన ప్రభువు - ధరకు నరుగును
పాలనకై - బూరశబ్దముతో - జనులారా
Verse
సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధి జేయునిలన్ - పరమునకై
బుద్ధిహీనులను - శ్రమలచేత - బద్ధులుగ జేయున్ - వేదనతో
బాధ కలిగించున్ - సాతాను
Verse
స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్
తనదూత - సూర్యచంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్
ప్రభురాక - పగలు రాత్రియగున్ - త్వరపడుము
Verse
మొదట లేతురు సజీవులై - ప్రభునియందుండు - ఆ మృతులు
మరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము - ధరనుండి
ధన్యులగుదుము - పరికించు
Verse
వెయ్యియేండ్లు పాలించెదరు ప్రియుని - రాజ్యమున
ప్రియులు, సాయం సమయమున - చేరి నెమలి కోకిలలు
రాజున్ - పాడి స్తుతించును - ఆ దినము
Verse
గొర్రె మేకలును - ఆ చిరుత సింహజాతులును ఒక చోట
భేధము లేక బరుండి గరిక మేయును - ఆవేళ
కలసి మెలగును - భయపడక
Verse
న్యాయ నీతులన్ - మన ప్రభువు ఖాయముగ దెల్పున్
ఆనాడు - సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకు
ధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా

Related Tags

Second ComingRaptureEnd Times