Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuni Seva Jaeyarammu O Yauvanudaa

ప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా

Prabhuni Seva Jaeyarammu O Yauvanudaa

Chorus
ప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా
ప్రబలజేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం
శుభమునిట్టి సేవ జేయ యువ జనాళికిన్
Verse
యేసు క్రీస్తు సిలువపైని మరణ మాయెను
చేసెను పాపికి గొప్ప విడుదల
నొసగెను మానవులకు నిత్య జీవము
వాసిగ ప్రజలలో తెలియ జేయవా?
Verse
పాప వస్త్రములను తీసె ప్రభువు క్రీస్తుడు
శాపగ్రాహి యాయెను ఓ యౌవనుడా
కప్పెను రక్షణ వస్త్రము నీకు
తప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ?
Verse
పాదములకు సువార్తనే చెప్పులొసగెను
హృదయమందు శాంతి ఆనందమొసగెను
శోధనా బాధలెన్నో నీకు వున్ననూ
నాథుని సువార్తను బోధపరచవా?
Verse
తప్పిపోయినట్టి నిన్ను కనికరించెను
గొప్పవిందు చేసి ఉంగరమును పెట్టెను
తప్పులన్ని మన్నించెను గొప్ప దేవుడు
తప్పక క్షమియించవా నీ విరోధులన్?
Verse
పరలోకపు బహుమానము నీవు పొందను
పరిశుద్ధుల సహవాసం నీకు శ్రేష్ఠము
పరలోకపు పందెమందు అంతము వరకు
పరుగెత్తవా జీవకిరీటంబు పొందను?

Related Tags

GospelDedicationYouthService