Chorus
ప్రభుపై భారమెల్ల మోపుమయా
కలత చెందకుమా
కాపాడు ప్రభుడొక్కడున్నాడయా
కనుపాపలా కాచునూ
Verse
నీతిమంతుడు పడిపోడయ్యా
నిత్యము కాపాడి నడిపించును‖ ప్రభు ‖
Verse
నీడగ ఉండి కాపాడును
ఆశ్రయమిచ్చి ఆదుకొనును‖ ప్రభు ‖
Verse
తల్లియు తండ్రియు విడిచిననూ
కౌగిలిలో నన్ను దాచుకొనును‖ ప్రభు ‖
Verse
మన పక్షమున ప్రభువుండగా
కదలక మెదలక నేనుందును‖ ప్రభు ‖