Verse
ప్రభురాజ్యం నిశ్చలమైనది
శుభప్రదంబు శాశ్వతమైనది
Verse
పృథివినందు వున్న వన్నియు - కదలి గతించి పోవుచున్నవి
గతించదు నీ వాక్యమెప్పుడు - ఖ్యాతిగాను నిలుచునెప్పుడు
Verse
జనాంగములు కదలుచున్నవి - జగమందెల్లను శాంతియేలేక
ప్రభుని ప్రజలు స్థిరులై యుందురు - విభుని ప్రజలు నిత్యముండెదరు
Verse
భూమి ఆకాశముల్ కదలింపబడును - అంతరించి తరలిపోవున్
ప్రభుని గృహము కదలదెన్నడు - విభుని యిల్లు నిత్యమునిలుచున్
Verse
ఉదయించునుగ రాజ్య మొకటి - పొడిచేయునుగ అన్యరాజ్యములన్
ఆ రాజ్యం అంతరించదు - ఆ రాజ్యం నిత్యము నిలుచున్
Verse
తన ప్రజలకు రాజ్యము నొసగన్ - ఘనుడగు తండ్రి కోరిక యిదియే
ప్రభు ప్రేమ చలించనేరదు - ప్రభు ప్రేమ నిలుచు నిరతం