Chorus
ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు
దొరుకు ప్రేమ శాంతి ఆనందం - పరిపూర్ణ మహిమ నిరీక్షణ
Verse
గతదినముల దుర్నీతి క్రియల మతిని నీవు మరువుము
పాతకముల జూపి బాపున్ మా దయామయు డేసు
Verse
చింతపడకు భవిష్యత్తునకై ఏమి చేయుదునంచు
సంకట దుఃఖములను బాపున్ ఆశ్రయమే నాయేసు
Verse
అంధకారము కమ్ముచున్నది యుద్ధము దుఃఖములతో
భీతిభయములతో నెటులబోదు నాతో నా ప్రభువుండన్
Verse
నమ్మజాల మీ లోకమును వ్యర్థము సర్వమును
ప్రభుని చరణములే శరణం దయాసాగరుడేసు