Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva ani pradhisthe chaluna

ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా

Prabhuva ani pradhisthe chaluna

Verse
ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
దేవా అని అర్ధిస్తే సరిపోవునా
Verse
మనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసినా
బ్రతుకు బాగుపడకుండా కన్నీళ్ళు కార్చినా
ప్రభుని క్షమను పొందగలమా దీవెనల నొందగలమా
ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా
Verse
పైకి భక్తి ఎంత ఉన్న లోన శక్తి లేకున్న
కీడు చేయు మనసు ఉన్న కుటుంబాలు కూల్చుతున్న
సుఖ సౌఖ్యమునొందగలమా సౌభాగ్యము పొందగలమూ
ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా
Verse
మాటతీరు మారకుండా మనుష్యులను మార్చతరమా
నోటినిండా బోధలున్నా గుండె నిండా పాపమున్నా
ప్రభు రాజ్యం చేరగలమా ఆ మహిమను చూడగలమా
ఆలోచించుమా ఓ సేవకా ఆలోచించుమా ప్రియ బోధకా

Related Tags

PrayerRepentanceChristian Life