Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva Chesithivi Vagdanamulu Matho Neravarchithivi

ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి

Prabhuva Chesithivi Vagdanamulu Matho Neravarchithivi

Chorus
ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి
బహు నేర్పుతోడన్ సన్నుతించెదనో ప్రభువా
Verse
వెదకితివి నన్ను నీ వాక్యముచే
తగిన కాలమున నిన్ను చేరన్ తరుణమిచ్చితివి
సొత్తని నన్ను నీ పుత్రునిజేయ కడిగితివి నీ రక్తముతో
Verse
బాలుడను భావన వలదంటివి
బహుజనంబులకు ప్రవక్తగా నియమించితివి
గర్భమునందే రూపించిన ప్రభూ పేదనైన నేను పూజింతున్
Verse
భయభీతిలో నాకు అభయము నిచ్చి
విజృంభించిన విరోధిపై విజయము నిచ్చి
కట్టను నాటను నా నోటను నీమాట నుంచిన ప్రభూ కీర్తింతున్
Verse
మందిర మహిమను హెచ్చులోనుంచ
సైన్యాధిపతి నీదు సమాధానము నిచ్చి
ఈ స్థలమును నీదు శాంతితో నింపిన షాలేమురాజా స్తోత్రింతున్
Verse
మోషేకు నీవు మాటిచ్చినట్లు
అడుగుడి ప్రతి స్థలము లన్నిటిని మాకిచ్చుటకు
పరిశుద్ధాత్మతో నింపిన ప్రభువా పలుమాటలతో ప్రణుతింతున్
Verse
ఇహపరమందున సర్వాధికారివై శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చిన
ఆత్మదేవా యుగాంతమున నీ సన్నిధి మాతో
నున్నందులకై స్తుతియింతున్
Verse
వర్థిల్లదంటివి ఏ ఆయుధమున్ నీకు విరోధంబుగా రూపించినచో
న్యాయ విమర్శలో తరుణమిచ్చితివి
నేర స్థాపన చేయన్ హల్లెలూయా

Related Tags

WorshipPromiseProphecy