Verse
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
Verse
నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది
నన్ను ఆదరించు వాడోకడును లేడాయెను
నన్ను ఆదరించుము నా యేసయ్యా‖ 2x ‖
Verse
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
Verse
నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను
నా మనస్సు కృంగిపోయెను
నా మనసును లేవనెత్తుము యేసయ్యా‖ 2x ‖
Verse
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
Verse
నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి
నా కంటి పాపను విశ్రమింపనీయక
నీ సన్నిధిలో నా హృదయమును కుమ్మరించెదను‖ 2x ‖
Verse
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
Verse
ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు
కృపయు వాత్సల్యత గల దేవుడవు
దయ చూపు దేవుడవు నిరీక్షణ ఆధారము నీవే‖ 2x ‖
Verse
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము