Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva Guri Yoddhake Parugetthuchunnanu Nenu

ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను

Prabhuva Guri Yoddhake Parugetthuchunnanu Nenu

Verse
ప్రభువా, గురి యొద్దకే - పరుగెత్తుచున్నాను నేను
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని
Verse
ఏవేవి లాభకరములై యుండెనో - వాటిని క్రీస్తు నిమిత్తం
నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను
Verse
క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును
ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్
Verse
క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము
సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను
Verse
వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై
వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను

Related Tags

WorshipDevotionalChristian