Verse
ప్రభువా మాకు నీవిచ్చిన బహుమానము – బహు శ్రేష్టమైనది
మా జీవితాలలో ఈ నూతన పరిణామము – ప్రత్యేకమైనది‖ 2x ‖
గర్భములో రూపింపబడిన నాటినుండి
కాపాడితివయ్యా – ఇకను కాపాడుమయ్యా‖ 2x ‖
నీ సన్నిధిలో నిలిపే దయ చూపవా
నీ జ్ఞానములో పెంచే కృపనీయవా‖ 2x ప్రభువా ‖
నీ మార్గములో తన కాళ్ళతో నడవాలి నా యేసయ్యా
నీ సత్యమును తన కళ్ళతో చూడాలి నా యేసయ్యా‖ 2x ‖
తన చేతులతో నీ సేవను చేస్తూ
తన పెదవులతో నిను స్తుతియించాలయ్యా‖ 2x ‖
ప్రార్థనాపరురాలిగ ఉండాలయ్యా‖ నీ సన్నిధిలో ‖
నీ వాక్యము తన హృదయములో పదిలముగా ఉండాలయ్యా
నీ తలంపులు అన్ని వేళలా తన మదిలో నిండాలయ్యా‖ 2x ‖
నీ దయయందు మనుష్యుల దయయందు
వర్ధిల్లేలా నీవే దీవించయ్యా‖ 2x ‖
నీ ప్రియమైన బిడ్డగా స్థిరపరచయ్యా‖ నీ సన్నిధిలో ‖