Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva Na Prardhana Aalakinchuma

ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా

Prabhuva Na Prardhana Aalakinchuma

Verse
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా
Verse
కారుచీకటి వేళలో నా దారి కానక పోయెనే
నమ్మిన ఆ స్నేహమే నన్ను ఒంటరిగా చేసెనే
కాదనని ప్రేమకై నే నిన్ను చేరితినయ్యా‖ 2x ‖
Verse
మరపురాని నిందలే నా గాయములను రేపెనే
మదిలో నిండిన భయములే నన్ను కృంగదీసెనే
నన్ను మరువలేని ప్రేమకై నే నిన్ను చేరితినయ్యా‖ 2x ‖
Verse
నేను చేసిన పాపమే నాకు శాపమై మిగిలెనే
నాదు దోష కార్యములే నన్ను నీకు దూరము చేసెనే
నన్ను మన్నించే ప్రేమకై నిన్ను చేరితినయ్యా‖ 3x 2x ‖

Related Tags

PrayerRepentanceSupplication