Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva Nee Karyamunu Noothana Parachumu Maalo

ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో

Prabhuva Nee Karyamunu Noothana Parachumu Maalo

Verse
ప్రభువా నీ కార్యమును - నూతన పరచుము మాలో
పరిశుద్ధ దేవా నీకు - ప్రజలమై యున్నా మిలలో
Verse
సంవత్సరములు జరుగుచుండగనే సత్యదేవా
విలువైన నీదు కార్యమును - తెలియజేయుము మాకు
Verse
పాపము జేసి నీదు - కోపము రేపితిమయ్యా
కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా
Verse
ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యా
ప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను
Verse
వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువా
పలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా
Verse
మారుచున్న లోకమున - కారుతొట్లలో త్రాగన్
జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా
Verse
సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యా
ఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము
Verse
మేలిమి బంగారుగను - మమ్ముల జేసితివయ్యా
మాలిన్యమునంటి మేము - మందగిలియున్నాము
Verse
మాటతప్పని మాదేవా - కోటగా నున్నావయ్యా
చాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా

Related Tags

PrayerRepentanceRenewal