Chorus
ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే‖ ప్రభువా ‖
Verse
సంగీతములాయె
పెను తుఫానులన్నియు‖ 2x ‖
సమసిపోవునే నీ నామ స్మరణలో‖ 2x ‖
సంతసమొందె నా మది యెంతో‖ 2x ప్రభువా ‖
Verse
పాప నియమమును
బహు దూరముగా చేసి‖ 2x ‖
పావన ఆత్మతో పరిపూర్ణమైన‖ 2x ‖
పాద పద్మము హత్తుకొనెదను‖ 2x ప్రభువా ‖
Verse
నీలో దాగినది
కృప సర్వోన్నతముగా‖ 2x ‖
నీలో నిలిచి కృపలనుభవించి‖ 2x ‖
నీతోనే యుగయుగములు నిల్చెద‖ 2x ప్రభువా ‖
Verse
నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి‖ 2x ‖
నూతనమైన శుభాకాంక్షలతో‖ 2x ‖
నూతన షాలేమై సిద్దమౌదు నీకై‖ 2x ప్రభువా ‖