Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuva Pampu Varshamunu Nee Vagdanamulu Sthiraparachi

ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి

Prabhuva Pampu Varshamunu Nee Vagdanamulu Sthiraparachi

Chorus
ప్రభువా పంపు వర్షమును
నీ వాగ్దానములు స్థిరపరచి
భీకర ధ్వనితో రానిమ్ము
Verse
ఏలియా మొరపెట్టగానే
మేఘములు కారుగమ్మెను
మోపైన వాన - భువిపైన గురిసే
మా దీన ప్రార్థన వినుమా
Verse
కడవరి వాన కాలమున
వర్షము దయ చేయు మిలలో
పైరు మొలుచునట్లు ప్రతి చేని లోను
మెరుపులను పుట్టించుము
Verse
దేవా! నీ స్వాస్థ్యము మీద
సమృద్ధిగా కురిపించుము
దాహముతోను - దస్సిన మమ్ము
బలపరచి స్థిరపరచుము
Verse
ఆత్మీయ గొడ్డుతనములో
నలమటించుచున్న మాకు
ఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచి
ఉజ్జీవింప జేయు మమ్ము
Verse
మా నోట నగ్ని తగిలించి
మా దోషమంతా తొలగించి
పంపుము దేవా - నిను సేవించుటకు
ప్రాపుగ ప్రకటింపనిమ్ము

Related Tags

PrayerHoly SpiritRevival