Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Ee Aanandam

ప్రభువా ఈ ఆనందం

Prabhuvaa Ee Aanandam

Verse
ప్రభువా ఈ ఆనందం
నాలో కలిగిన వైనం
వర్ణింపలేనిది ఈ అద్భుతం‖ 2x ‖
నీలో నేను ఉండగా
నాలో నీవు నిలువగా
నీకై నేను పాడగా ఆనందం‖ 2x ‖
ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్
ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్
ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ‖ 2x ప్రభువా ‖
Verse
ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం‖ 2x ‖
వర్ణింపలేనిది సరిపోల్చలేనిది
నా ప్రభునిలో ఆనందం‖ 2x ప్రెయసెస్ ‖
Verse
స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం
ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం‖ 2x ‖
పరలోకపు మార్గములో నను నడువ చేయునది
ప్రభు యేసుని వాక్యాహారం‖ 2x ప్రభువా ‖

Related Tags

PraiseWorshipJoy