Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Hithavathsaram Maaku Ichaavayyaa

ప్రభువా హితవత్సరం మాకు ఇచ్చావయ్యా

Prabhuvaa Hithavathsaram Maaku Ichaavayyaa

Lyricist: Pastor B Shalem Raju
Verse
ప్రభువా హితవత్సరం మాకు ఇచ్చావయ్యా
విడుదల సంవత్సరం ప్రకటించియున్నావయ్యా
నిను విడువనని యెడబాయనని
ఆశీర్వదించావయ్యా హల్లెలూయా
లోకమంతటిని ముంచెత్తిన
తెగులు చేతిలో పడనీయక
పనిపాటులేవి లేకున్నను
కరువనేది రానీయక
అనుకూల స్థితిలో తిను దాని కంటే
ప్రతికూల స్థితిలో సమృద్ధి నిచ్చావు
నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య
అవరోధమెంత ఎదురైనను
ఆగకుండ నీ పరిచర్యను
ఆశ్చర్య రీతిలో జరిగించావు
అధిక మహిమను చూపించావు
తండ్రి నీ సన్నిధికి నే దూరమైనా
దయజూపి నను నీ దరి జేర్చినావు
నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య

Related Tags

ThanksgivingNew YearBlessing