Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Kaachithivi Intha

ప్రభువా… కాచితివి ఇంత

Prabhuvaa Kaachithivi Intha

Verse
ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా‖ 2x ‖
నీ సాక్షిగా నే జీవింతునయ్యా‖ ప్రభువా ‖
Verse
కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా‖ 2x ‖
నన్ను వలచావులే – మరి పిలిచావులే‖ 2x ‖
అరచేతులలో నను చెక్కు కున్నావులే‖ 2x ప్రభువా ‖
Verse
నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా‖ 2x ‖
పాపము కడిగావులే – విషము విరచావులే‖ 2x ‖
నను మనిషిగా ఇలలోన నిలిపావులే‖ 2x ప్రభువా ‖
Verse
బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా‖ 2x ‖
నన్ను దీవించితివి – నన్ను పోషించితివి‖ 2x ‖
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే‖ 2x ప్రభువా ‖

Related Tags

PraiseThanksgivingDevotional