Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Mammunudheevinchi Pampumu

ప్రభువా మమ్మునుదీవించి పంపుము

Prabhuvaa Mammunudheevinchi Pampumu

Lyricist: Molathati Vidyanandamu
Chorus
ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి అభినందన ములఁ
జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్‖ ప్రభువా ‖
Verse
పగతురఁ బ్రేమించెడు శక్తిన్ తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ
చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్‖ ప్రభువా ‖
Verse
గుడిలో వినిన నీవాక్యము మా గుండెలఁ బదిలము జేయఁగను
గుడిబయటను నా చారములో నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము
లకు నీ కగుతన్‖ ప్రభువా ‖
Verse
క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము
లోకములో నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్‖ ప్రభువా ‖

Related Tags

WorshipBlessing