Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Nannu Karuninchumu Ne Ghora Paapini

ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని

Prabhuvaa Nannu Karuninchumu Ne Ghora Paapini

Chorus
ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని
పాపిని, పాపిని నే ఘోర పాపిని
Verse
లోకాశకు లొంగిపోయి – పడిపోయిన పాపిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
Verse
అన్యజనుల ఆచారముల నభ్యసించి చెడిపోతిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
Verse
నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు – చేసితిని
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
Verse
శరీరాశ, నేత్రాశను – పాపేచ్ఛను గల్గియుంటి
ఎన్నికలేని పాపిని నే ఘోరపాపిని నే ఘోరపాపిని
Verse
నారక్షకుడా యేసు నాథా – నన్ను నీవు రక్షించితివి
నిన్నే నిత్యము పూజింతును
సేవింతు నిరతము – సేవింతు నిరతము
సేవింతున్ పూజింతున్ – నిరతము సేవింతున్

Related Tags

GospelRepentanceConfession