Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Ne Ninnu Nammi

ప్రభువా నే నిన్ను నమ్మి

Prabhuvaa Ne Ninnu Nammi

Lyricist: Andhra Kraisthava Keerthanalu
Verse
ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు‖ 2x ప్రభువా ‖
Verse
గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ
ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి
నన్ను తప్పించినావు‖ 2x ప్రభువా ‖
Verse
నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికియున్నా
నిన్నే సేవింతు దేవా‖ 2x ప్రభువా ‖

Related Tags

PraiseFaithTrust