Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Ne Ninnu Nammi Ninna

ప్రభువా నే నిన్ను నమ్మి నిన్న

Prabhuvaa Ne Ninnu Nammi Ninna

Verse
ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు
Verse
గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ
ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు‖ ప్రభు ‖
Verse
నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు
నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు‖ ప్రభు ‖
Verse
పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న
మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు‖ ప్రభు ‖
Verse
జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు
నే సంచరించునట్లు నే జారిపోకుండ
ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు‖ ప్రభు ‖
Verse
నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!

Related Tags

ProtectionRefugeTrust