Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Nee Goppathanamu Sthuthiki Yoagyamu

ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము

Prabhuvaa Nee Goppathanamu Sthuthiki Yoagyamu

Verse
ప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యము
అశక్యమైనది - వర్ణించలేమిల
Verse
సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమము
మానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తము
నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల
Verse
నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివి
క్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివి
నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల
Verse
సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పది
నీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావు
నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల
Verse
నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావు
అందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివి
నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల
Verse
అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివి
రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి
నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల
Verse
ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచి
సంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరి
నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల

Related Tags

PraiseWorship