Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuvaa Nee Kaluvari Thyaagamu Choopenae Nee Paripoornathanu

ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను

Prabhuvaa Nee Kaluvari Thyaagamu Choopenae Nee Paripoornathanu

Verse
ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే‖ ప్రభువా ‖
Verse
నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి‖ 2x ‖
లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే‖ 2x ప్రభువా ‖
Verse
జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే‖ 2x ‖
శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే‖ 2x ప్రభువా ‖
Verse
సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే‖ 2x ‖
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే‖ 2x ప్రభువా ‖

Related Tags

HolinessSalvationSacrifice